వినయం, విధేయత, సమయస్ఫూర్తి ఆయన ఆస్తులు. షరీఫ్ 2004-2009 మధ్య టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2015లో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. 2017లో ప్రభుత్వ విప్ అయ్యారు. పార్టీకి అంతర్గతంగా సేవలు అందించి మన్ననలు అందుకున్న ఆయన్ను.. టీడీపీ అధినేత చంద్రబాబు మండలి చైర్మన్‌గా అందలమెక్కించారు.
అధికార పక్షం సభలోనే తనకు రాజకీయాలు ఆపాదించినా.. నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని టీడీపీ సూచిస్తున్నా.. షరీఫ్ మాత్రం ఎక్కడా ఏకాగ్రతను కోల్పోలేదు. సభ నియమావళిని అతిక్రమించలేదు. రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి నివేదిస్తారా లేదా అని షరీఫ్ తీసుకునే నిర్ణయం కోసం సభ్యులతోపాటు రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో గంటలపాటు ఎదురుచూశారు.