సీఎం జగన్‌కు షాక్... రాజధాని తరలింపునకు నో చెప్పిన కేంద్రం?

శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (17:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విశాఖపట్టణానికి తరలించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇందుకోసం ఆయన కరోనా కష్టకాలంలో కూడా వ్యూహ రచనలు చేస్తున్నట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి, కేంద్రం అనుమతి ఉన్నా లేకున్నా ఏప్రిల్ నెలాఖరు లేదా మే మొదటి వారం నుంచి రాజధాని కార్యకలాపాలను విశాఖపట్టణం నుంచి శ్రీకారం చుట్టాలన్న తపనలో జగన్ ఉన్నట్టు సమాచారం. 
 
ఇందులోభాగంగానే, ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుడు, సీఎం జగన్ కుడిభుజమైన విజయసాయి రెడ్డి కూడా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. విశాఖపట్టణంలో కరోనా కేసులు సంఖ్య తగ్గిందని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ జిల్లాలో మొత్తం 20 కేసులు నమోదు కాగా, పది కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో ఏపీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రాజాధాని తరలింపునకు కేంద్రం నో చెప్పినట్టు ఆ వార్త సారాంశం. ప్రస్తుతం కోవిడ్ 19 కారణంగా నిధుల కొరత రాష్ట్రంలో ఏర్పడే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించినట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటి ఏప్రిల్ నెలాఖరు వరకు ఆగాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు