తెలుగులో స్మృతి ఇరానీ ట్వీట్... వైరల్ అయిన ట్వీట్

శుక్రవారం, 16 ఆగస్టు 2019 (12:37 IST)
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలుగులో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా ఉత్తర భారతావనికి చెందిన స్మృతి ఇరానీ.. హిందీ లేదా ఇంగ్లీషులో ట్వీట్ చేస్తుంటారు. కానీ, ఈ దఫా తెలుగులో ట్వీట్ చేశారు.
 
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు చేపట్టే వివిధ రకాల పథకాలకు మంచి ప్రాచూర్యం కల్పించే నిమిత్తం ఆమె ప్రాంతీయ భాషలను తన ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఇది ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకర్షిస్తోంది. 
 
ఆయా రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకునేలా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఇటీవల తెలుగులో ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 'సమర్థ్' అనే పథకాన్ని తీసుకొచ్చిందని స్మృతీ ఇరానీ తెలిపారు.
 
ఇందులోభాగంగా ఏపీలోని 12,000 మంది యువతకు దుస్తుల తయారీలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. వీరికి ఉపాధి కల్పించేందుకు కేంద్ర జౌళి పరిశ్రమ శాఖ కృషి చేస్తోందన్నారు. ఈ పథకాన్ని ఇప్పటికే 16 రాష్ట్రాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ట్వీట్ చేసిన స్మృతీ ఇరానీ, తన ట్వీట్‌కు ఓ వీడియో కూడా జతచేశారు. 

 

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా అమ‌లు చేస్తున్న ‘స‌మ‌ర్ధ్’ ప‌థ‌కం కింద ఆంధ్ర ప్ర‌దేశ్‌ లో 12,000 మంది యువ‌తకు దుస్తుల త‌యారీ లో నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు శిక్ష‌ణ ఇస్తారు. pic.twitter.com/KiIOZuI1yQ

— Smriti Z Irani (@smritiirani) August 14, 2019

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు