గత నెల జూలై 26న స్పందన పున: ప్రారంభించడం జరిగిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు స్పందన కార్యక్రమాలు జరిగాయన్నారు. ఇందులో ప్రజలు నేరుగా 81 సమస్యల అర్జీలను అందించగా, 59 అర్జీలను పరిష్కరించామన తెలిపారు. ఆర్ధిక పరమైన 20 అర్జీలు, పునపరిశీలనలో 2 అర్జీలు కలిపి మొత్తం 22 ఆర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
ప్రతి సోమవారం అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ప్రజలు నేరుగా అందించిన అర్జీలను సంబందిత వెబ్ సైట్ నందు నమోదు చేసి సంబందిత అధికారులకు పంపిస్తామని మేయర్ చెప్పారు. క్షేత్ర స్థాయి సిబ్బంది సమస్యలను పరిష్కరించిన తర్వాత అర్జీదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకొని స్పందన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నట్లు మేయర్ వివరించారు.