గంజాయి మత్తులో విజయవాడ నగర శివారులో ఒక యువకుడు హంగామా చేశాడు. బ్లేడ్ తో పీక కోసుకున్నాడు... ఆ తరువాత స్ధానికులకు బయబ్రాంతులకు గురి చేశాడు. పోలీసులు వచ్చి ఆసుపత్రికి తరలిస్తే, అక్కడ నుండి పారిపోయాడు. చివరికి పోలీసులు చొరవతో మళ్లీ పట్టుకొని తెచ్చి, గాయాలకు వైద్యం చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.