ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్స్ పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ఉంటాయి. ఇంకా జూనియర్ కాలేజీల విషయానికి వస్తే మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలీడేస్‌ను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో ఒకటి, రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.