మందు బాబులకు మరో షాక్ ఇచ్చిన ఏపీ సర్కారు

బుధవారం, 10 నవంబరు 2021 (18:16 IST)
మందు బాబులకు మరో షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. మద్యంపై పన్ను రేట్లు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. మద్యం మూల ధరపై తొలి విక్రయం జరిగేచోట పన్ను సవరణ చేసింది. దేశంలో తయారైన విదేశీ బ్రాండ్లపై ధర ఆధారంగా పన్నుల్లో మార్పులు చేసింది. రూ.400 లోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్ విధించింది. రూ.400-2,500 మద్యం కేసుకు 60 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది. 
 
రూ.2,500-3,500 వరకు ఉన్న మద్యం కేసుకు 55 శాతం వ్యాట్ , రూ.3,500-5,000 ధర ఉన్న మద్యం కేసుపై 50 శాతం వ్యాట్‌ , రూ.5 వేలు, ఆపై మద్యం కేసుపై 45 శాతం వ్యాట్ వసూలుకు నిర్ణయం తీసుకుంది. దేశీయ తయారీ బీర్‌ కేసుపై రూ.200 కంటే తక్కువున్న వాటిపై 50 శాతం వ్యాట్‌ వేయనున్నారు. రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్ కేసుపై 60 శాతం వ్యాట్ విధించనున్నారు. అన్ని రకాల మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు