కంచ ఐలయ్యను ఉరితీయమనడం తప్పే : ఎంపీ టీజీ వెంకటేష్

బుధవారం, 18 అక్టోబరు 2017 (12:21 IST)
దళిత రచయిత, మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్యను బహిరంగంగా ఉరి తీయమనడం తప్పేనని, అందువల్ల ఆయనపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ టీజీ వెంకటేష్ ప్రకటించారు. 
 
కంచ ఐలయ్య "కోమటోళ్లు - సామాజిక స్మగ్లర్లు" అనే పుస్తకాన్ని రాయగా, ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఆ సామాజిక వర్గానికి చెందిన వారు విరుచుకుపడ్డారు. అలాగే, అదే సామాజికవర్గానికి చెందిన టీజీ వెంకటేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఐలయ్యను బహిరంగంగా ఉరి తీయాలని వ్యాఖ్యానించారు. దీనిపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు.
 
అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఐలయ్యపై వెంకటేష్‌ వ్యాఖ్యలపై చర్చ కూడా జరిగింది. దీంతో తన మాటలపై స్పందించిన ఆయన అలా వ్యాఖ్యానించడం తన తప్పేనని, దాన్ని అంగీకరిస్తూ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే యూఎస్ సెనెటర్ ఐలయ్యకు మద్దతు పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక తనకు పిచ్చిపట్టి పుస్తకాలు రాస్తున్నట్టు ఐలయ్య ఒప్పుకున్నారని చెప్పిన వెంకటేష్‌, అలాంటి పుస్తకాలను ఎవరూ ఒప్పుకోరని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు