అనంతరం అధ్యాపకులు, విద్యార్థినీవిద్యార్థులతో మాట్లాడుతూ... మన ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరుముగ్గురు పిల్లలని సముదాయించేందుకే ఎంతో కష్టపడిపోతుంటారు. అలాంటిది ఒక క్లాసుకి 30 మంది విద్యార్థినీవిద్యార్థులను కూర్చోబెట్టి వారికి పాఠాలను బోధించడం మాటలు కాదు. అధ్యాపకులు ఎంతో కష్టపడుతుంటారు. వారి కష్టానికి ప్రతిఫలంగా దేశంలోనే అత్యధిక జీతం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.
ఇది జరుగుతుందో లేదో తెలియదు కానీ నావంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. అధ్యాపకులు నిరంతరం పిల్లలకు పాఠాలు చెబుతూ వారికి క్రమశిక్షణ నేర్పుతారు. వారి బోధనలతోనే పటిష్టమైన సమాజం ఏర్పడుతుంది. నిరంతరం పిల్లలకు పాఠాలు చెప్పే అధ్యాపకులకు పోషకాహారం కూడా అవసరం. ఎందుకుంటే వారు అలసిపోతుంటారు. వారికి బాలబాలికలకు ఎలా మధ్యాహ్న భోజనం అందిస్తున్నామో అలాగే అధ్యాపకులకు కూడా పోషకాహారం అందించే ప్రయత్నం జరగాలి'' అని వెల్లడించారు.