జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఠాగూర్

ఆదివారం, 23 మార్చి 2025 (10:36 IST)
ఏపీలోని శ్రీ అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె అసెంబ్లీ నియోజకవర్గం, కురబలకోట మండలం మదివేడులోని దండు మారెమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రికార్డ్ డ్యాన్స్ పేరుతో నిర్వహించిన సంగీత విభావరి కాస్త అసభ్య నృత్య ప్రదర్శనగా మారిపోయింది. ఈ రికార్డు డ్యాన్స్ కోసం తీసుకొచ్చిన మహిళలు అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఈ వేడుకలు స్థానిక తెలుగుదేశం పార్టీ నేత వైజి సురేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. 
 
ఈ జాతరకు భద్రతగా వచ్చిన పోలీసులు సైతం చూసీచూడనట్టుగా వదిలేయడంతో పాటు గుర్రుపెట్టి నిద్రపోయారు. జాతరకు భద్రత కల్పించిన పోలీసులు కళ్లముందే అశ్లీల, అర్థనగ్న నృత్యాలు చేస్తున్నా తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా దండు మారెమ్మ జాతర వేడుకలు జరుగుతున్నప్పటికీ గతంలో ఎన్నడూ ఈ తరహా నృత్యాలు, సంస్కృతి చూడలేదని గ్రామస్థులు నోరెళ్లబెట్టారు. 
 
ఈ అశ్లీల నృత్యాలపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్లీల నృత్యాలు చేస్తుంటే ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

మారెమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు..!

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం ముదివేడు గ్రామంలో జరిగిన దండు మారెమ్మ జాతరలో పలువురు అశ్లీల నృత్యాలను చేశారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశ్లీలు ఇలాంటి నృత్యాలను ప్రదర్శిస్తుంటే, ప్రభుత్వం,… pic.twitter.com/RdXcaSPXyf

— ChotaNews App (@ChotaNewsApp) March 23, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు