తూ.గో. జిల్లా ఏజెన్సీలో కాళ్లవాపు వ్యాధి గ్రస్తులను ఆదుకోవాలని సీఎం ఆదేశం

సోమవారం, 25 మే 2020 (19:56 IST)
తూర్పుగోదావరి జిల్లా కాళ్లవాపువ్యాధి ఘటనలపై సీఎం వైయస్‌.జగన్‌ ఆరాతీశారు. మళ్లీ కాళ్లవాపు వ్యాధి విస్తరణపై ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే బాధితులకు సరైన వైద్యచికిత్స అందించాలని, వారిని ఆదుకోవాలని ఆదేశించారు.

తక్షణమే ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనానిని, అధికారులు బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారు. ఒక సమగ్రమైన ఆలోచన చేయాలని, మళ్లీ ఈవ్యాధి రాకుండా ఉండాలంటే.. ఏంచేయాలన్నదానిపై ప్రణాళిక తయారుచేయాలని, వెంటనే వైద్య బృందాలను పంపి చికిత్స అందించాలని కూడా సీఎం ఆదేశాలు జారీచేశారు.
 
లాయర్ల కార్పస్‌ నిధికే రూ.100 కోట్లు
న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.100 కోట్లను వారి కార్పస్‌ నిధికే అప్పంగించాలని సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశించారు. ఈ నిధుల నిర్వహణను వారికే అప్పగించాలని అధికారులను స్పష్టంచేశారు.

లా నేస్తం పేరిట ఇప్పటికే న్యాయవాదులను ఆదుకుంటోందని, ఇప్పుడు బదిలీచేసిన నిధి ద్వారా మరింత ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు