నరేంద్రమోదీ రెండవసారి ప్రధానిగా ఎన్నికై ఒక సంవత్సరకాలం పూర్తి అయిన సందర్భముగా విజయోత్సవ కార్యక్రమాలు, ఉత్సవాలకు దూరంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా నిర్వహణ జరుగుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే నిర్వహించిన రెండు ర్యాలీ సభలు విజయవంతం అయ్యాయి.
ఇక చివరిగా నిర్వహించబోయే మూడవ వర్చువల్ ర్యాలీ ఈనెల 26 న కోస్తాంధ్ర పార్లమెంట్ జిల్లాల వారిగా నిర్వాహించటం జరుగుతుందని, ఈ సభకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, మన తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ముఖ్య అతిధిగా విచేస్తారని కన్నా తెలిపారు.