సెల‌వులు ముగిశాయి... హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

సోమవారం, 17 జనవరి 2022 (10:57 IST)
సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో అంతా మ‌ళ్లీ డ్యూటీల‌కు, త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుతున్నారు. పల్లెల నుంచి పట్నం బాట పడుతున్నారు జనాలు. నేటి నుంచి ఆఫీస్ లు తెరుచుకోవడంతో సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతున్నారు.
 
 
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగి పోయింది. రద్దీ దృష్ట్యా పంతంగి టోల్ ప్లాజా , కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు ర‌వాణా శాఖ అధికారులు. టోల్ గేట్ల వ‌ద్ద ఫాస్ట్ ట్యాగ్ ఉన్నా కూడా, భారీ సంఖ్య‌లో వాహ‌నాలు ఒకేసారి వ‌స్తుండంతో అవి కూడా స్పీడ్ అందుకోలేక‌పోతున్నాయి. వాహ‌నాలు టోల్ గేట్ వ‌ద్ద నిలిచిపోతున్నాయి.
 
 
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు సాధారణం కంటే హైవేపై రెట్టింపు వాహనాలు వస్తున్నాయి. దీంతో అధికారులు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అటు సొంతూళ్ల నుంచి, హైదరాబాద్‌ కు వచ్చే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 3500 బస్సులను ఏర్పాటు చేసింది. క‌రోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల సెలవులను పెంచేసింది కేసీఆర్‌ సర్కార్‌. జనవరి 16 తో ముగియాల్సిన సంక్రాంతి సెలవులు కేసీఆర్‌ సర్కార్‌ నిర్ణయంతో జనవరి 30 వరకు విద్యా సంస్థలకు సెలవులు వ‌చ్చేశాయి. దీనితో కొంత మంది త‌మ సొంతూరిలోనే గ‌డిపేస్తున్నారు. అయినా, ఆఫీసుల‌కు వెళ్ళాల్సిన వారు త‌ప్ప‌క హైద‌రాబాద్ ప‌య‌న‌మ‌వుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు