ఓసి నీ తెలివి తగలెయ్య... జ్యూడీషియల్ రిమాండ్ తప్పించుకునేందుకు...

ఆదివారం, 30 ఆగస్టు 2020 (11:21 IST)
విశాఖపట్టణం జిల్లాలో కలకలంరేపిన దళిత యువకుడి శిరోముండనం కేసులో జ్యూడీషియల్ రిమాండ్‌ను తప్పించుకునేందుకు ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన మధుప్రియ అనారోగ్య నాటకానికి తెరలేపింది. ఈ కేసులో సినీ నిర్మాత నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. 
 
మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో ఈ కేసు నమోదు చేశారు. దీంతో నూతన్‌ నాయుడు భార్యతో పాటు మిగతావారిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీ ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి. 
 
అయితే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నూతన్ నాయుడు భార్య మధుప్రియ జ్యుడీషియల్ రిమాండ్ నుంచి తప్పించుకునేందుకు అనారోగ్యం నాటకం ఆడారు. దీంతో పోలీసులు ఆమెను కేజీహెచ్‌కు తరలించగా ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నట్టు చెప్పడంతో ఆమె నాటకం బయటపడింది.
 
శిరోముండనం కేసులో మధుప్రియ సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితులను విచారించేందుకు పోలీసులు కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతుండడంతో దాని నుంచి తప్పించుకునేందుకు మధుప్రియ అనారోగ్యం నాటకం ఆడారు. 
 
కాగా, ఈ వ్యవహారంలో నూతన్ నాయుడు ప్రమేయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ ఇంట్లో పనిమానేసిన కర్రి శ్రీకాంత్ అనే యువకుడిని మధుప్రియ ఇంటికి పిలిపించి శిరోముండనం చేయించడం రాష్ట్రంలో సంచలనమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు