ఏపీ ప్రత్యేక హోదా సాధనకు మొదట్లో తెరాస అండగా వున్నట్లు వార్తలు వచ్చాయి కానీ తాజాగా ఆ పార్టీకి చెందిన ఎంపి నర్సయ్య గౌడ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానం అంటే అదేదో పిల్లల ఆట కాదని వ్యాఖ్యానించారు. ఐనా పక్కింట్లో పెళ్లి జరుగుతుంటే మా ఇంట్లో రంగులు వేసుకోవాలా అంటూ ప్రశ్నించారు.
అవిశ్వాస తీర్మానం అనేది రాష్ట్ర ప్రజల కోసం కాదనీ, అదంతా రాజకీయ స్వార్థంలో భాగమేనని, తమతో చర్చించకుండా అవిశ్వాస తీర్మానం పెడితే తగుదనమ్మా అని తాము దానికి మద్దతివ్వాలా అని ప్రశ్నించారు. తెరాస పార్టీ చీఫ్ కేసీఆర్ సూచన మేరకు తామంతా కలిసి రిజర్వేషన్ల అంశం మాత్రమే పార్లమెంటులో పోరాడుతామన్నారు. కాబట్టి తెరాస ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతివ్వదని తేలిపోయింది.