కానీ ఆ తరువాత నుంచి ఇప్పటివరకు బదిలీ కాలేదు... పదోన్నతి రాలేదు. ఉన్నచోటే అలాగే ఉన్నారు. అయితే తిరుమల జెఈఓపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్ల వ్యవహారంలో ఈయన కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలు లేకపోలేదు. ఆ డబ్బునే అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకు ఇస్తూ పదవికి కాపాడుతుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన శ్రీనివాసరాజు ఆ తరువాత ముఖ్యమంత్రిలు మారినా సరే ఆయన మాత్రం అక్కడే ఉన్నారు. చంద్రబాబునాయుడు మాత్రం ఎప్పుడూ ఐఎఎస్‌ల విషయంలో సీరియస్‌గానే ఉంటారు. కానీ శ్రీనివాసరాజు విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోలేకపోవడానికి కారణం చినబాబట. తెదేపా కీలక నేత శ్రీనివాసరాజుకు అండగా ఉన్నారట. అందుకే శ్రీనివాసరాజు అక్కడి నుంచి బదిలీ కావడం లేదట.