మంచో చెడో చేయాల్సింది చేశాడు.. వెళ్లిపోయాడు : జగన్‌పై ఆర్ఆర్ఆర్ కామెంట్స్

వరుణ్

గురువారం, 13 జూన్ 2024 (15:46 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై జగన్ గురించి మాట్లాడటం దండగ అని ఒక ముక్కలో చెప్పేశారు. మంచో చెడో చేయాల్సింది చేశాడు.. వెళ్లిపోయాడు.. ఇకపై అతని గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, మంచో చెడో చేయాల్సింది చేశాడు. వెళ్లిపోయాడు. ఇపుడు ప్రజలు ఆ విషయం పట్టించుకోరు. ప్రజల దృష్టి ఇపుడు మాపై ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటుందా? ఎలా నెరవేర్చుతుందనేదే చూస్తారు. అందుకే మేం కూడా మా హామీలను అమలు చేసే విషయంపై దృష్టిని కేంద్రీకరించాం అని చెప్పారు. 
 
ఇకపై జగన్‌పై కానీ, వైకాపాపైన కానీ, ప్రజల దృష్టి ఉండదు. ఉండకూడదు అని పేర్కొన్నారు. ప్రజలు కూటమికి అధికారం ఇచ్చారు. అందుకే మనం దాడులకు పాల్పడవద్దని కోరుతున్నం. పైగా ప్రజలు గొప్ప బాధ్యతలను అప్పగించారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పారని, అందుకే తనపై జరిగిన కస్టోడియల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రఘురామకృష్ణంరాజు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు