దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శానిటేషన్ పనులు అస్తవ్యస్తం

సోమవారం, 30 సెప్టెంబరు 2019 (12:07 IST)
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శానిటేషన్ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో పరిశుభ్రత పాటించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ పారిశుద్ధ్య పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నియమించిన సిబ్బంది తమకు తోచిన విధంగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులు ఆరోపిస్తున్నారు. 
 
ఒక నియమం అనేది లేకుండా చెత్తను ఒక ప్రత్యేక ప్రాంతాల్లో ఉంచకుండా, ప్రత్యేక ప్రాంతాల్లో ఉంచవలసిన బాధ్యత శానిటేషన్ కాంట్రాక్టరుపై నెలకొని ఉంది. కానీ నీ కాంట్రాక్టర్ నిబంధనలు తుంగలో తొక్కి ఈవో సురేష్ బాబు ఆదేశాలు లెక్క చేయడం లేదు. కొంతమంది దేవస్థాన ఉద్యోగులు కాంట్రాక్టరుతో దుర్గగుడి కాంట్రాక్టర్ పారిశుద్ధ్య పనులు చేసే వారు రికార్డ్ అసిస్టెంటెంట్‌ సహకారం తీసుకుని నిబంధనలు పక్కన పెట్టారని ఆలయంలో ప్రచారం జరుగుతోంది. 
 
కాంట్రాక్టర్ల ఎవరు? నోరుమెదపని ఇంజినీరింగ్ అధికారులు. బాధ్యత లేని, నిబంధనలు పక్కన పెట్టిన కాంట్రాక్టర్లకు ఎంత చెల్లింపు చేస్తారు. అసలు ఈ కాంట్రాక్టు పనులకు ఎంత కేటాయించిన తీరు ఇంజినీరింగ్ అధికారులు తెలిపివారి పారదర్శ కథ నిరూపించుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు