పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌లో ఏం చూసి పవన్ కల్యాణ్ ఆదర్శవంతుడని పొగిడారో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. వాస్తవం ఉంటే పొగడాలని.. దాన్ని వదిలిపెట్టి పవన్ కేసీఆర్‌ను ఇంద్రుడు, దేవుడంటే ఎలా నమ్మాలని అడిగారు. డ్రగ్స్ కేసులో ఛార్జీషీట్ విడుదల చేయడంపై ఇన్ని రోజులు ఆగాలా అంటూ ప్రశ్నించారు.