క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రెండు గ్రామాలను లక్ష్యంగా తీసుకుని టీకా వేయాలని, అదే విధంగా ఒక్కో మండలంలో నాలుగురోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పారు.
ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు పూర్తికానందున మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని సందిగ్ధంలో అధికార యంత్రాంగం ఉందన్నారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులు ఎవరన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోందన్నారు.
మండలానికి రెండు పిహెచ్‌సిలు, ఒక్కో పిహెచ్‌సికి ఇద్దరు వైద్యులు ఉండాలని, ప్రతి మండలానికీ రెండు 104 వాహనాలు ఉండాలని సూచించారు.