అపవిత్ర దోస్తి.. నేను ఉండలేను : మాజీ మంత్రి వట్టి వసంత కుమార్

శుక్రవారం, 2 నవంబరు 2018 (10:25 IST)
జాతీయ స్థాయిలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఒక్కటి కావాలని తీసుకున్న నిర్ణయం చాలా మంది కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటం లేదు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 
 
గురువారం ఢిల్లీలో చంద్రబాబు, రాహుల్ గాంధీలు ఒక్కటై స్నేహాస్తం అందిపుచ్చుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ రాజీనామా చేశారు. 
 
1983 నుంచి పోరాడుతున్న టీడీపీతో కాంగ్రెస్ కలవడం దారుణమని అన్నారు వట్టి. ఈ కలయికను ఎవరు జీర్ణించుకోలేరని.. ఇకపై తాను కాంగ్రెస్ పార్టీలో ఉండబోనని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం వట్టి వసంత కుమార్ ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు