ఉప రాష్ట్రపతి శుక్రవారం ఉదయం తిరుమలలోని రచన విశ్రాంతి భవనంకు చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఉప రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు.
మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల క్షేత్రం ప్రాచీన భారతీయ సంస్కృతి, నాగరికతలో మహోన్నతమైనదని చెప్పారు. టీటీడీ పరిపాలన, భక్తులకు అందిస్తున్న సేవలు అన్ని మతాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు.