15న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

గురువారం, 7 అక్టోబరు 2021 (07:33 IST)
శ్రీ‌వారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు అక్టోబ‌రు 15న చక్రస్నానం కార‌ణంగా ఆల‌యంలో ప్ర‌త్యేక వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ కారణంగా గురువారం, అక్టోబర్ 15న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.  
 
అక్టోబ‌రు 14న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున విఐపిలు మరియు భక్తులు ఈ విషయాన్ని గమనించి  సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.
 
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఏకాంతంగా జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంపంగి ప్రాకారంలో వైఖాన‌స ఆగ‌మోక్తంగా బుధ‌వారం సాయంత్రం అంకురార్పణ జ‌రిగింది.

అనంత‌రం సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్య ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలోకి సేనాధిప‌తి వారిని వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు