దేశంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మైనర్లపై హత్యాచారాలకు పాల్పడుతున్నారు కొందరు మృగాళ్లు. అభం శుభం తెలియని ముద్దులొలికే చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. అలాంటి రాక్షసుల నుంచి పసిబిడ్డలను రక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది కేంద్రం. ఇలాంటి దురాగతాలకు కారణం అశ్లీల సైట్సే కారణమనే యోచనతో వాటిపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో చైల్డ్ పోర్నోగ్రఫీపై వరల్డ్ వైడ్‌గా నిషేధం విధించారు.
కానీ కొంతమంది విచ్చలవిడిగా అదే పనిగా పోర్న్ సైట్స్ చూస్తున్నారు. ఐతే ఇంటర్నెట్ చేతిలో ఉంది కదా అని అడ్డమైనవన్నీ విచ్చలవిడిగా చూస్తామంటే ఇక కుదరదు. ముఖ్యంగా చైల్డ్ పోర్న్ సైట్ లలోకి వెళ్తే ఇక జైలుకే అంటున్నారు పోలీసులు. ఇందులో భాగంగా నెట్‌లో అశ్లీల చిత్రాలు.. చైల్డ్ పోర్న్ సైట్స్ కోసం సెర్చ్ చేసే వారిపై ఫోకస్ పెట్టింది ఎన్.సి.ఆర్.బి. ఇందుకోసం ఢిల్లీలోని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్‌లో చైల్డ్ సెక్స్ అభ్యుజ్ మెటీరియల్ అనే ప్రత్యేక సెల్ కొనసాగుతోంది. నెట్‌లో ఎవరు ఏమేం చేస్తున్నారో తెలుసుకోవడమే ఈ సెల్ పని. బ్యాన్ చేసిన సైట్లను చూస్తే ఇక జైలుకే.
కేవలం చైల్డ్ పోర్న్ సైట్స్ చూడటమే కాదు.. గూగుల్‌లో చైల్డ్ పోర్న్ అని టైపి చేసినా వెంటనే వాళ్లకు ఇన్‌ఫర్‌మేషన్ వెళ్తుంది.ఈ నేపథ్యంలో, బాలల అశ్లీలలతకు సంబంధించిన ఫోటోలు వీడియోలు చూస్తున్న 16 మందిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ చిరునామాల ఆధారంగా హైదరాబాద్ కు చెందిన 16 మందిని గుర్తించిన కేంద్ర ఎన్.సి.ఆర్.బి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ 16 మంది ఐపీ అడ్రస్ లను పంపించింది. వారిపై ఐటి యాక్ట్ 67B కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. దీంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేసి వారి ఐపి అడ్రస్ ఆధారంగా వారిని గుర్తించే పనిలో పడ్డారు.. గతేడాది కూడా ఇదే తరహాలో సిఐడి పంపించిన ఐపీ అడ్రస్‌ల ద్వారా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సైబర్ క్రైం పోలీసులు.