దేశంలో ముగిసిన నైరుతి సీజన్... ప్రారంభంకానున్న ఈశాన్యం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

శుక్రవారం, 20 అక్టోబరు 2023 (15:36 IST)
దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది. ఇకపై ఈశాన్య రుతుపవన సీజన్ ప్రారంభంకానుంది. అదేసమయంలో బంగాళాఖాతంలో శుక్రవారం ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. అది వాయుగుండంగా మారే మారి మరింతగా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
ఇదిలావుంటే దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో అనేక రాష్ట్రాల్లో తగినంత వర్షపాతం నమోదుకాలేదు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలుపెట్టుకునివున్నాయి. ఈశాన్య రుతుపవనాలు వస్తూనే అల్పపీడనం ఏర్పడేందుకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఇందులోభాగంగా, శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది శనివారానికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబరు 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వివరించింది. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు