ప్రతి ఇంటికి మూడు మాస్క్‌లు పంపిణీ చేస్తామన్న మాట గాలికి వదిలేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రైతులు పండించిన పంటలో పదోవంతు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, పంటలకు ధరలు లేక రైతులు నైరాశ్యంతో ఉన్నారని విమర్శించారు.
హైకోర్టులో ఇటీవల వేసిన అఫిడవిట్‌లో 4,92,977 మెట్రిక్ టన్నుల ధాన్యం, మొక్కజన్న 46,660 మెట్రిక్ టన్నులు, జన్న 5,693, శనగ 10,872, కందులు 43,261 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించిందని చంద్రబాబు తెలిపారు.
ఆక్వా, సెరికల్చర్ ఉత్పత్తులన్నీ కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్వారంటైన్ కేంద్రాల నుంచి 14 రోజుల తర్వాత ఇంటికెళ్లేవారికి రూ.2 వేలు అందిస్తామన్న హామీ కూడా అమలు కాలేదన్నారు.