నారా లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ కొందరు తెదేపా నాయకులు చేసిన వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ అయితే పడింది. కానీ దీనివల్ల పవన్ కల్యాణ్ అంటే ఏమిటో ప్రజలు మరింతగా అర్థం చేసుకున్నట్లుగా వారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ గురించి ఓ మీడియా విలేకరి అడిగినప్పుడు వచ్చిన సమాధానం ఎలాగున్నదో చూడండి.
డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించరు. దేవుడిని పక్కన బెడితే భక్తులు పూజ చేయడం మానేస్తారా? ఆయన ప్రజా సేవ చేస్తున్నారు. ఒకప్పుడు పవన్ అంటే ఏదో అనుకునేవారు. మూడు పెళ్లిళ్లు నాలుగు పెళ్లిళ్లు అంటూ అన్నారు. ఇవాళ పవన్ గురించి అందరికీ అర్థమైపోయింది. ఏదో అనుకోకుండా ఆయన జీవితంలో అలా జరిగిపోయింది. ప్రతి ఒక్క పౌరుడికి అవసరమైన సేవ చేస్తున్నారు. ఇలాంటి నాయకుడిని ఎవరైనా వదులుకుంటారా? అంటూ ప్రశ్నించారు.