దీంతో ముందు జాగ్రత్త చర్యగా.. మార్చి 10 వ తేదీన ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో 48 గంటల ముందే మద్యం దుకాణాలు బంద్ కాబోతున్నాయి. అంటే మార్చి 8,9,10 తేదీల్లో మద్యం అందుబాటులో ఉండదు. అలాగే ఓట్ల లెక్కింపు మార్చి 14న ఉండనుంది.
ఓట్ల లెక్కింపుకు 24 గంటల ముందు కూడా మద్యం అమ్మకాలు ఉండవు. అంటే..మార్చి 13, 14 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీ (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్.. సోమవారం జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. మొత్తంగా రాష్ట్రంలో ఐదు రోజులపాటు మద్యం దుకాణాలు మూతపడనుండడం మందుబాబులకు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు.
12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. షెడ్యూల్ ప్రకారం మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ప్రకటించారు.