టెక్కీ భర్తపై అనుమానంతో ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఆత్మహత్య కేసు వివరాలను పరిశీలిస్తే... ఖమ్మం బూరాన్‌పూర్ ప్రాంతానికి చెందిన నీరుడు సుధాకర్ హైదరాబాద్ హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు అనూష (27) అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా హైదరాబాద్ నగరానికి వచ్చి లంగర్‌హౌస్ జానకీనగర్‌లో నివసిస్తున్నాడు. అనూష కూడా బీటెక్ చదివింది. పిల్లలు చిన్నగా ఉండడంతో ఇంట్లోనే ఉంటోంది.