ఏంది బొంగులో అరెస్ట్ చేసేది నువ్వు, నా వెంట్రుక కూడా పీకలేవు: పేర్ని నాని

ఐవీఆర్

శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (17:15 IST)
పేర్ని నాని చానాళ్లకు మళ్లీ చిన్నగా ఘాటు పదాలను వల్లించడం ప్రారంభించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి కొల్లు రవీంద్రపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొల్లు రవీంద్ర ప్రజలకు సేవ చేయడానికి పనికిరాడనీ, రాలిపోయిన గింజలు ఏరుకుని తినడానికి మాత్రమే పనికివస్తాడని అన్నారు. ప్రజా సేవ చేయడం ఆయనకు చేతకాని పని అనీ, లోకేష్ తెచ్చే మూటల నుంచి రాలిపడిన నోట్లను జేబుల్లో కుక్కుకోవడానికి పనికొస్తాడంటూ ఎద్దేవా చేసారు.
 
గత నవంబర్, డిశెంబరు నెలల నుంచి చెబుతున్నారు... పేర్ని నాని, కొడాలి నానిలను అరెస్ట్ చేస్తాం... అరెస్ట్ చేస్తాం అని. ఏంది బొంగులో అరెస్ట్ చేసేది నువ్వు, నా ముంజేయి మీద వున్న వెంట్రుక కూడా పీకలేవు అంటూ వ్యాఖ్యానించారు పేర్ని నాని. మరి మంత్రి కొల్లు రవీంద్ర దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి వుంది.

మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు..

గత ఏడాది నవంబర్ నుండి అరెస్టు చేస్తానంటూ మొరుగుతున్నావు

నీ అరెస్టుల వల్ల నా చేతి మీద రోమాలు కూడా ఊడవు

అరెస్టులకు భయపడేది లేదు

- పేర్ని నాని pic.twitter.com/WSTJKe2L6T

— BIG TV Breaking News (@bigtvtelugu) February 21, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు