ప్రతి అన్యమతస్తుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే... జగన్‌కు వర్తిస్తుంది : వైఎస్ షర్మిల

ఠాగూర్

శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (16:12 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం కోసం వచ్చే ప్రతి ఒక్క అన్యమతస్తుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని, ఇందులో వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మినహాయింపు ఉండబోదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే జగన్ వద్ద కూడా డిక్లరేషన్ తీసుకోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.
 
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం, తిరుపతి డిక్లరేషన్‌పై ఆమె స్పందిస్తూ, జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్నారు. లడ్డూలకు వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ల్యాబ్‌లో నిర్ధరణ అయిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన నిజానిజాలు ప్రజలకు తెలియాలని డిమాండ్‌ చేశారు. 
 
అలాగే, భవిష్యత్‌లో ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షురాలిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తాను లేఖ రాసినట్లు తెలిపారు. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని కోరామన్నారు.
 
మరోవైపు జగన్‌ తిరుమల పర్యటనలో డిక్లరేషన్‌ అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆమె స్పందించారు. డిక్లరేషన్ రూల్ అందరికీ వర్తిస్తుందన్నారు. 'రూల్స్ అప్లైడ్ ఫర్ ఆల్ పీపుల్' అని వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు