ఇదే అంశంపై విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. గుంటూరు లోక్‌సభ స్థానంలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో రిటర్నింగ్ అధికారి పక్షపాతం ప్రదర్శించారు. స్వల్వ సాంకేతిక కారణం చూపి 9700 ఓట్లను లెక్కించలేదు. ఆర్వో అక్రమానికి పాల్పడి తెలుగుదేశం 4200 ఓట్ల తేడాతో గెలిచినట్టు ప్రకటించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.
కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ గెలుపొందినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ స్థానం నుంచి వైకాపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆఖరుకు ఆయన ఓటమిపాలయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ స్థానంలో వైకాపా అభ్యర్థి ఓడిపోవడంపై పార్టీ అధినేత జగన్ వద్ద పార్టీ సీనియర్ నేతలు చర్చించారు. ముఖ్యంగా, ఆర్వో అక్రమాలకు పాల్పడి టీడీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారని, అందువల్ల న్యాయపోరాటం చేద్దామని కోరడంతో జగన్ సమ్మతించారు. దీంతో గుంటూరు లోక్‌సభ స్థానంపో న్యాయపోరాటం చేయనున్నట్టు విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో అధికారికంగా వెల్లడించారు.