వైఎస్ఆర్‌సిపికి వణుకు పుట్టిస్తున్న కేకే సర్వే ఎగ్జిట్ పోల్: 2019లో వైసిపికి 135, 2024లో కూటమికి 161

ఐవీఆర్

సోమవారం, 3 జూన్ 2024 (12:59 IST)
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నాయో తెలుపుతూ పలు సర్వే సంస్థలు జూన్ 1వ తేదీన వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే వీటన్నిటిలో కేకే సర్వే వెల్లడించిన ఫలితాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. 
 
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపికి 135 స్థానాలు వస్తాయంటే, 151 వచ్చాయి. అలాగే తెదేపాకు 25 నుంచి 35 స్థానాలనీ, జనసేనకి 0-3 స్థానాలు అని చెప్పారు. దాదాపుగా అలాంటి ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు 2024లో కూటమికి 161 సీట్లు వస్తాయని కేకే సర్వేస్ వెల్లడించింది. పైగా జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో అంటే... 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని తెలిపింది.
 
ఇప్పుడు ఇదే వైసిపిని వణుకుపుట్టించే విషయంగా మారుతోంది. గత ఎన్నికల్లో కేకే సర్వేస్ ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. అలాగే ఈ 2024 అసెంబ్లీ ఫలితాలు కూడా నిజమైతే ఏంటి అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఉత్కంఠతకు రేపటి జూన్ 4 ఓట్ల లెక్కింపుతో తెరపడనుంది.

KK Survey: 2019 vs 2024#HelloAP_ByeByeYCP pic.twitter.com/c84fChlpQ4

— ℝ???????????????????? ????????????????????????????(@RameshTummala2) June 2, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు