రాష్ట్రంలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నేపథ్యంలో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే పనిలో ముఖ్యమంత్రి వైఎస్ తలమునకలయ్యారు. ఇందులో భాగంగా తొలివిడతగా 35మందికి ఆయన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఎంపికచేసిన ఈ 35మందికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదముద్ర వేసిన తరుణంలో సోమవారం సాయంత్రం గవర్నర్ ఎన్డీ తివారీ కొత్త మంత్రివర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
రాష్ట్ర మంత్రివర్గం తొలిజాబితాలో చోటు దక్కించుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయ రామారావు, విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ, విశాఖనుంచి పసుపులేటి బాలరాజు, తూర్పు గోదావరినుంచి పిల్లి. సుభాష్ చంద్రబోస్, పి. విశ్వరూప్‌లు మంత్రివర్గంలో చోటు సాధించారు. వీరితోపాటు పశ్చిమ గోదావరి జిల్లానుంచి పితాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్, కృష్ణా జిల్లానుంచి పార్థసారధి, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, గాదె. వెంకటరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్, మోపిదేవి వెంకటరమణలు కూడా స్థానం సాధించారు.
అలాగే ప్రకాశం జిల్లా నుంచి రోశయ్య, బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు ఆనం రామనారాయణరెడ్డి, ఖమ్మంనుంచి రామిరెడ్డి వెంకటరెడ్డి, మెదక్‌నుంచి గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ, సునీతా లక్ష్మారెడ్డిలను అదృష్టం వరించింది. వీరి తర్వాత రంగారెడ్డి జిల్లానుంచి సబితా ఇంద్రారెడ్డి, నిజామాబాద్నుంచి సుదర్శన్ రెడ్డి, చిత్తూరు నుంచి గల్లా అరుణ, పి. రామచంద్రారెడ్డి, కర్నూలునుంచి శిల్పా మోహన్‌రెడ్డి, కడపనుంచి అహ్మదుల్లా, అనంతనుంచి రఘువీరారెడ్డి, మహబూబ్‌నగర్‌నుంచి డీకే అరుణ, జూపల్లి కృష్ణారావులు మంత్రివర్గంలో చేరారు.
చివరగా హైదరాబాద్‌నుంచి దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, వరంగల్ నుంచి పొన్నాల, కొండా సురేఖ, కరీంనగర్‌నుంచి శ్రీధర్‌బాబు, నల్గొండనుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా మంత్రివర్గంలో స్థానం సాధించారు. మంత్రివర్గంతోపాటు స్పీకర్‌గా ఫ్రభుత్వ చీప్ విప్ కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్‌ల స్థానాలు ఖరారయ్యాయి.