26-03-2021 - శుక్రవారం మీ రాశి ఫలితాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల...?
శుక్రవారం, 26 మార్చి 2021 (05:00 IST)
ఇష్టకామేశ్వరి దేవిని పూజించడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది.
మేషం: విద్యార్థినులకు ఏకాగ్రత, ప్రశాంత వాతావరణం అనుకూలిస్తాయి. బ్యాంక్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వుంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
వృషభం: ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మనస్సుకు నచ్చిన వారితో కాలం గడుపుతారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మెడికల్, ఎరువులు, ఫ్యాన్సీ రంగాల్లో వారికి సంతృప్తి కానవస్తుంది. దైవ కార్యాల్లో చురుకుగా పాల్గొంటారు.
మిథునం: ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ యత్నాలు త్వరలోనే ఫలిస్తాయి. కాంట్రాక్టర్లకు తాపీ పని వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కారమవుతాయి. సోదరీ, సోదరులు సన్నిహితులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది.
కర్కాటకం: బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. ఖర్చులు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు ఎప్పటి నుంచో ఆగి వున్న పనులు పునఃప్రారంభమవుతాయి. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతారు. మిత్రుల కలయిక అనుకూలించక పోవడంతో నిరుత్సాహం చెందుతారు.
సింహం: పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మిక, సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిలో అంచనాలు తారుమారు కావచ్చు. వ్యాపారాల్లో ఆకర్షణీయమైన ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. కార్యసాధనలో ఆటంకాలెదురైనా ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేయండి.
కన్య: చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులను ధన సాయం అడిగేందుకు అభిజాత్యం అడ్డువస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. శత్రువులు, మిత్రులుగా మారి సాయం అందిస్తారు. మీలో వచ్చిన మార్పు మీ శ్రీమతికి సంతోషం కలిగిస్తుంది.
తుల: ఎంతటి క్లిష్టమైన సమస్యైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహించుట వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో వారికి గుర్తింపుతో పాటు చికాకులు తప్పవు. ప్రత్తి, పొగాకు, కంది, స్టాకిస్టులకు వ్యాపారస్తులకు కలిసివస్తుంది. స్త్రీల ఆరోగ్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి.
వృశ్చికం: సంతానం మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో వుంచుకోవడం క్షేమదాయకం. ప్లీడరు ప్లీడరు గుమస్తాలకు ప్రోత్సాహం కానరాగలదు. మిర్చి, ఆవాలు, నూనె, స్టాకిస్టులకు, వ్యాపారులకు పురోభివృద్ధి. మొహమ్మాటాలు, ప్రలోభాలకు దూరంగా వుండటం క్షేమదాయకం.
ధనస్సు: శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ధనం బాగా అందటం ద్వారా ఏ కొంతైనా నిల్వచేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. కాంట్రాక్టర్లు నూతన టెండర్లు చేజిక్కించుకుంటారు. వస్త్ర, బంగారు వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టడం మంచిది.
మకరం: గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు చేపడతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ వహించండి. స్త్రీలు తోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవడం క్షేమం కాదు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు.
కుంభం: రచయితలకు, పత్రిక, మీడియా రంగాల్లో వారికి పనిభారం అధికం కాగలదు. రవాణా, న్యాయ ప్రకటనలు, విద్యారంగాల వారికి శుభప్రదం. బంధువులతో సమస్యలు తలెత్తవచ్చు. ఉన్నతస్థాయి అధికారులకు అపరిచిత వ్యక్తుల పట్ల చికాకులు తప్పవు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం.
మీనం: ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం మంచిది కాదని గమనించండి. చిన్న తప్పిదమైనా పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. కుటుంబ, ఆర్థిక సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి అనుకూలం.