సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగవు. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది.
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. దాంపత్యసౌఖ్యం పొందుతారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో సతమతమవుతారు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. బంధువులతో విభేదాలు, దంపతుల మధ్య సఖ్యతలోపం. ఆలోచనలతో సతమతమవుతారు. సంప్రదింపులు ఫలించవు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
కీలక విషయాలపై పట్టు సాధిస్తారు. మాటతీరు ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి.
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. కొత్త పనులు మొదలెడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహనిర్మాణాలకు ఆమోదం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
స్థిరాస్తి ధనం అందుతుంది. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. మీ జోక్యం అనివార్యం. ఖర్చులు సామాన్యం. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణంలో కొత్తవారితో జాగ్రత్త.
ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. మీ అభిప్రాయాలను తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నిస్తారు. అంతరంగిక విషయాలు వెల్లడించవద్దు.
సంకల్పం నెరవేరుతుంది. మాట నిలబెట్టుకుంటారు. మీ చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది. ధనలాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటిస్తారు. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు.
తలపెట్టిన కార్యం విజయవంతవుతుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ధనలాభం ఉంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆహ్వానం అందుకుంటారు.