ఆర్థికలావాదేవీలు ముగుస్తాయి. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఫోను సందేశాలు పట్టించుకోవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. సోదరులతో సమస్యలెదురవుతాయి.
ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పొగిడే వ్యక్తులను నమ్మవద్దు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. అవివాహితులు శుభవార్త వింటారు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఖర్చులు ప్రయోజనకరం. పనులు సానుకూలమవుతాయి పిల్లల మొండితనం అసహనం కలిగిస్తుంది. సౌమ్యమంగా మెలగండి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. కొత్తపరిచయాలేర్పడతాయి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. సాయం అంచవద్దు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. శుభకార్యానికి హాజరవుతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు మనోబలం ముఖ్యం. యత్నాలు కొనసాగించండి. ఆదాయం బాగున్నా వెలితిగా ఉంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆలోచనలతో సతమతమవుతారు. పనుల్లో ఒత్తిడి చికాకులు అధికం. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
ఆర్థికంగా మంచి ఫలితాలున్నాయి. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సముచితీ నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమొత్తం ధనం అందుతుంది. పనులు వేగవంతమవుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పత్రాలు అందుకుంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు విపరీతం, ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. తలపెట్టిన పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కష్టించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. నిస్తేజానికి లోనవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు పురమాయించవద్దు. కొత్తవిషయాలు తెలుసుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంతోషకరమైన వార్త వింటారు. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. కొత్త పనులు చేపడతారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది.