కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులకు మరింత చేరువవుతారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. పొదుపు ధనం అందుకుంటారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త, పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
విజ్ఞతతో వ్యవహరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. బంధువులతో కాలక్షేపం చేస్తారు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. దూరప్రయాణం తలపెడతారు.
ఆచితూచి అడుగేయాలి. అందరితోను మితంగా సంభాషించండి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ధనం మితంగా వ్యయం చేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంప్రదింపులు ఫలిస్తాయి. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రావలసిన ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. అకాలభోజనం, విశ్రాంతి లోపం.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో అడుగులేయండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఖర్చులు సామాన్యం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. మీ ప్రతిపాదనలకు ఆశించిన స్పందన లభిస్తుంది.
కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహాన్నిస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పత్రాలు అందుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు.
వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. తలపెట్టిన పనులు ఆకస్మింగా నిలిపివేస్తారు.
నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. వేడుకకు హాజరవుతారు.
కీలక విషయాల్లో సన్నిహితుల సలహా పాటించండి. అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అందరితోనూ సౌమ్యంగా మెలగండి. ధనం మితంగా వ్యయం చేయండి. తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
అనుకూలతలు అంతంత మాత్రమే. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. దుబారా ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ వాక్కు ఫలిస్తుంది. పరిచయాలు, సంబంధాలు బలపడతాయి, మాట నిలబెట్టుకుంటారు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. కీలక పత్రాలు అందుతాయి, అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.