శ్రీ క్రోధినామ సం|| శ్రావణ బ|| పంచమి ప.1.04 అశ్వని రా.12.02 రా.వ.8.18 ల 9.48. ఉ.దు.5.42 ల 7.24.
మేషం :- ఆపత్సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయానం చేయాల్సివస్తుంది. భాగస్వామిక వ్యపారాలు, జాయింట్ వెంచర్లు సంతృప్తికరంగా సాగుతాయి. ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
వృషభం :- ఉద్యోగస్తులు తోటివారితో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహంలో స్వల్ప మార్పులు, మరమత్తులు చేపడతారు. స్త్రీలకు ఆలయాలలో సందర్శనాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతుంది. చేతి వృత్తుల వారికి అన్ని విధాలా కలిసివస్తుంది.
మిథునం :- పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ముందుచూపుతో ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఫలితానిస్తుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు ఆశించినంత లాభసాటిగా ఉండదు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాలలో భంగపాటు తప్పదు.
కర్కాటకం :- ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమంచవలసి ఉంటుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలో ఏకాగ్రత ముఖ్యం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమఫలితం.
సింహం :- మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. స్త్రీలకు బంగారం, నూతన వస్త్రాలపై మక్కువ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల కష్టనష్టాలు ఎదుర్కుంటారు. కోర్టు వ్యవహరాల్లో ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు నూతనటెండర్ల వ్యవహారంలో ఏకాగ్రత, విషయ పరిజ్ఞానం అవసరం.
కన్య :- వృత్తి ఉద్యోగాల్లో కొంత పురోగతి ఉంటుంది. బ్యాంకు చెక్కులు ఇచ్చే విషయంలో పునరాలోచన మంచిది. దైవ సేవా కార్య క్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగ యత్నాలు కలిసివస్తాయి. వాహన చోదకులకు ఊహించని చికాకు లెదుర్కోవలసి వస్తుంది.
తుల :- రిప్రజెంటేటివ్‌లు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. భవిష్యత్ గురించి తగు శ్రద్ధ తీసుకుంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు పురోభివృద్ధి. స్త్రీలు ఆత్మీ యులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణ ప్లాను ఆమోదం పొందటంతో పాటు రుణాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం :- ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవటం మంచిది. ఇతరుల వ్యాఖ్యలు మీపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. దంపతుల మధ్య ప్రేమాను బంధాలు బలపడతాయి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మునుముందు మంచి ఫలితాల నిస్తాయి.
ధనస్సు :- ఒక భారం దించుకున్న తర్వాతనే కొత్త పనులు చేపట్టటం మంచిది. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. మీ సంతానానికి ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సులలో అవకాశం లభిస్తుంది. కష్టసమయంలో అయిన వారే ముఖం చాటేస్తారు.
మకరం :- ముఖ్యమైన వ్యవహారాల్లో ఎదుటివారిని సలహా అడగటం మంచిదని గమనించండి. మీ పనులు మీరే స్వయంగా చూసుకోవడం శ్రేయస్కరం. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలెడతారు. హోటల్, తినుబండారాలు, బేకరీ పనివారలకు సామాన్యం. ఖర్చులు అధికమవుతాయి.
కుంభం :- సాంఘిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలకు పనిభారం అధికం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. తలపెట్టిన పనులలో ఒత్తిడి, జాప్యంవంటి చికాకులు ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులకుఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
మీనం :- ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంతకాలం వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో సానుకూలత లుంటాయి. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తి నిస్తుంది. ఆస్థి వ్యవహారాల్లో ముఖ్యులతో విభేదాలు తలెత్తుతాయి. విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు.