శ్రీ క్రోధినామ సం|| శ్రావణ ఐ|| పాఢ్యమి రా.10.38 ధనిష్ట ఉ.7.55 ప.వ.2.41 ల 4.12. ఉ.దు. 8.16 ల 9.07 రా.దు. 10.58 ల 11.43.
మేషం :- హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. వాహనం కొనుగోలు యత్నం ఫలిస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. రవాణా రంగాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. చిన్న చిన్న విషయాలను అంతగా పట్టించుకోవద్దు.
వృషభం :- భాగస్వామిక చర్చలు అర్థాంతంగా ముగుస్తాయి. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికం. దైవ, శుభ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్థిరాస్తులు, వాహనం కొనుగోలు చేస్తారు. విద్యార్ధినులకు ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో అవకాశం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
మిథునం :- మీ శ్రీమతి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. పట్టుదలతో శ్రమిస్తే కాని పనులు నెరవేరవు. కోర్టు వ్యవహరాలు నిరుత్సాహపరుస్తాయి. స్త్రీలు తమ సరదాలు, కోరికు వాయిదా వేసుకుంటారు. ఉన్నతాధికారులకు తనిఖీలు, పర్యవేక్షణలలో ఏకాగ్రత ముఖ్యం. సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ రంగాల వారికి ఆందోళన తప్పదు.
కర్కాటకం :- ఒక స్థిరాస్తి అమర్చు కోవాలనే దిశగా మీ ఆలోచనలుంటాయి. ఒక్కోసారి ధనం ఎంతవ్యయం చేసినా ప్రయోజనం ఉండదు. ఉమ్మడి వ్యవహరాల్లో పట్టింపు లెదురవుతాయి. విద్యార్థులకు ఉపాధ్యాయులు, సహచరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలు ఆడంబరాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు.
సింహం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మక శక్తికి, మీ తెలివి తేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. దైవ, పుణ్యకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది.
కన్య :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. పాత మిత్రులకలయిక గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. సహచరుల సలహావల్ల నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఆశాజనకం. ఒక్కసారి ప్రేమిస్తే దాన్ని నిలబెట్టుకొవడానికి ఎంతైనా పోరాడతారు.
తుల :- బంధువుల కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. ఒకానొక వ్యవహారంలో మీ ప్రమేయం మంచి ఫలితాలనిస్తుంది. సైన్సు, గణిత రంగాలలోని వారికి గణనీయమైన పురోభివృద్ధి. కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఆలయాలను సందర్శిస్తారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు వెల్లివిరుస్తాయి.
వృశ్చికం :- ఆర్థిక అవసరాలు ఖర్చులు పెరగటంతో అదనపు ఆదాయానికై శ్రమిస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత, మెళుకువ అవసరం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసకి మరింత బలపడుతుంది. వ్యాపార వర్గాల వారి మాటతీరు, స్కీములు కొనుగోలు దార్లను ఆకట్టుకుంటాయి. కోర్టు వ్యవహరాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది.
ధనస్సు :- భార్యా, భర్తల మధ్య సరైన అవగాహన లేక మనస్పర్ధలు రావచ్చును. ప్రైవేటు సంస్థల్లోవారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల మాటపడక తప్పదు. ప్రయాణాలలో మెళుకువ అవసరం. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలకు కలిసివస్తుంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం.
మకరం :- స్త్రీలకు పనివారితో చికాకులు తలెత్తుతాయి. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆకస్మికంగా ప్రయాణం వాయిదా చేయవలసివస్తుంది. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ఆదరణ లభిస్తుంది. బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఉమ్మడి ఆస్తి విక్రయాల్లో సోదరుల నుంచి అభ్యంతరా లెదుర్కుంటారు.
కుంభం :- మీ వాగ్ధాటి, సమయస్ఫూర్తితో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. చేపట్టిన పనులువిసుకుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. స్త్రీలకుసంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఐరన్, ఆటోమోబైల్, ట్రాన్స్‌పోర్టు రంగాల్లో వారికి ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు.
మీనం :- పాత సమస్యలు ఛేదించి ధైర్య సాహసాలతో ముందుకుసాగండి. మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోవటం మంచిది. కానివేళలో బంధు మిత్రుల రాకఇబ్బంది కలిగిస్తుంది. విద్యా సంస్థల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం.