09-06-2023 శుక్రవారం దినఫలాలు - దత్తాత్రేయుడిని ఆరాధించి మీ సంకల్పం...
శుక్రవారం, 9 జూన్ 2023 (04:00 IST)
శ్రీ శోభకృత్ నామ సం|| జ్యేష్ఠ ఐ|| షష్టి రా.8.21 ధనిష్ట రా.9.19 తె.వ.4.01 ల 5.31. ఉ.దు. 8.03 ల 8.55 ప.దు. 12.23 ల 1.15.
మేషం :- స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, బహుమతులు అందుతాయి. బాకీలు, ఇంటి అద్దెలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఉపాధ్యాయులకు యాదృచ్ఛికంగానే దుబారా ఖర్చులు అధికమవుతాయి. మీ వ్యాపకాలు తగ్గించుకుని కుటుంబ విషయాలపై దృష్టి సారించాలి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి.
వృషభం :- వ్యాపార వ్యవహారాల్లో ఉమ్మడి సమస్యలు తలెత్తవచ్చును. కొంతమంది మీ బలహీనతలను కనిపెట్టి లబ్ది పొందాలని యత్నిస్తారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య ఆస్తి విషయాల గూర్చి తగాదాలు రావచ్చు.
మిథునం :- కొన్ని సందర్భాలలో రిస్క్ తీసుకోవాల్సి వచ్చినా చివరికి మంచే జరుగుతుంది. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. వ్యాపారాభివృద్ధికి ఆర్థిక సంస్థల నుంచి ఋణం మంజూరవుతుంది. ముక్కుసూటిగా పోయే మీ తీరు విమర్శలకు దారితీస్తుంది. గణిత, సైన్సు రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు.
కర్కాటకం :- దైవ సేవా కార్యక్రమాల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ శ్రీమతి సలహాపాటించటం వల్ల మేలేజరుగుతుంది. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పవు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడా లుంటాయి.
సింహం :- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేసే యత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సమస్యలను పట్టించుకోకుండా ఇతరులకు సహాయం చేస్తారు. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు శ్రేయస్కరం కాదని గమనించండి.
కన్య :- మీ ఆశయాలకు, అభిరుచులకు తగిన వ్యక్తులతో సంబంధాలు బలపడతాయి. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు పొందుతారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
తుల :- విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. సొంత పరిజ్ఞానంతో మందులు వేసుకోవటం మంచిది కాదు. రవాణా రంగాల వారికి ఇబ్బందులు అధికమవుతాయి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం చేకూరుతుంది.
వృశ్చికం :- పెద్దల సహాయంతో ఒక సమస్యను అధిగమిస్తారు. అధికారులు, తోటి ఉద్యోగస్తులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఏదైనా అమ్మకానికై చేయుయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి.
ధనస్సు :- వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మొక్కుబడులు చెల్లిస్తారు. ఇతరుల సలహా కంటె సొంత నిర్ణయాలే మేలు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. రాజకీయనాకులకు అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచితుల పట్ల అప్రమత్తత అవసరం.
మకరం :- నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి. ఎప్పటి సమస్యలను అప్పుడు పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. తాపి పనివారికి లాభదాయకంగా ఉంటుంది. ఎవరికైన ధన సహాయం చేసినా ధనం తిరిగి రాజాలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కుంభం :- ఉద్యోగస్తులకు పని భారం అధికమవుతుంది. స్త్రీలకు ఇరుగు పొరుగువారితో మనస్పర్థలు తలెత్తుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కొన్ని విషయాల్లో ఓర్పును కోల్పోతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం.
మీనం :- లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికం. కొబ్బరి, పండ్ల, పూల, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. జీవనోపాధికి సొంతంగా ఏదైనా చేయాలి అనే ఆలోచన స్ఫురిస్తుంది.