ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. ఖర్చులు తగ్గించుకుంటారు. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
వ్యవహారాల్లో ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఖర్చులు విపరీతం. ముఖ్యులను కలిసినా ఫలితం ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. మీ శ్రీమతి చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ప్రయాణంలో జాగ్రత్త.
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు సంతృప్తికరం. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. పనులు నిరాటంకంగా సాగుతాయి. కొత్తవారితో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ప్రముఖులకు వీడ్కోలు పలుకుతారు.
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోండి. ఆవేశాలకు లోను కావద్దు. ధనసమస్యలెదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు పురమాయించవద్దు. అప్రమత్తంగా ఉండాలి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
ప్రముఖులకు సన్నిహితులవుతారు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త, ఆహార నియమాలు పాటించండి. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. ఫోన్ సందేశాలు నమ్మవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారాల్లో భేషజాలకు పోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఖర్చులు విపరీతం. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు, కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతాయి. మాటతీరుతో నెట్టుకొస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
సంప్రదింపులు ఫలిస్తాయి. రుణ సమస్యల నుంచి విముక్తులవుతారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు మందకొడిగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
పట్టుదలతో యత్నాలు సాగించండి. కొందరి వ్యాఖ్యలు కష్టమనిపిస్తాయి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.
ప్రణాళికలు వేసుకుంటారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. అపరిచితులతో మితంగా సంభాషించండి.