ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.
వ్యవహారాలతో తీరిక ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఒత్తిడికి గురికావద్దు. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తారు. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. ప్రయాణంలో కొత్త వ్యక్తులతో జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. మీ సాయంతో ఒకరికి ప్రయోజనం కలుగుతుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు ముందుకు సాగవు. అసహనానికి గురవుతారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ఖర్చులు సామాన్యం. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల చొరవతో సమస్య సానుకూలమవుతుంది.
సమర్ధతను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. నోటీసులు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
విజ్ఞతతో వ్యవహరిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. గృహం సందడిగా ఉంటుంది. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. విదేశాల సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి.
రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు.