శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట శు॥ అష్టమి రా.10.53 ఉత్తర పూర్తి ప.వ.12.56ల 2.42. ఉ.డు. 8.04 ల 8.56 ప. దు. 12.24 ల 1.16.
మేషం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఆకస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు తప్పవు. ఇచ్చిపుచ్చుకొనే వ్యవహరాలు, ఒప్పందాల్లో మెళుకువ వహించండి. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులు వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులు స్థానమార్పిడికై చేయు యత్నాలు అనుకూలించవు.
వృషభం :- కొన్ని అనుకోని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ప్రయత్నపూర్వకంగా నిరుద్యోగులకు అవకాశం కలిసివస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు, ప్రాజెక్టులు, సంస్థల స్థాపనలకు అనుకూలం. ఆలయ సందర్శనాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. గృహ వాస్తు దోష నివారణ వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
మిథునం :- మీ చిత్తశుద్ధి, నిజాయితీలకు ప్రశంసలు లభిస్తాయి. విందులలో పరిమితి పాటించండి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
కర్కాటకం :- రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. మొహమ్మాటం వీడి బంధుమిత్రులతో ఖచ్చితంగా వ్యవహరించండి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి.
సింహం :- ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. అధిక ఉష్ణం వల్ల మీ సంతానం ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
కన్య :- వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళకు మెళుకువ అవసరం. విద్యార్థులకు కొత్త ఆలోచనలు స్ఫూరిస్తాయి. ఉద్యోగ యత్నంలో దళారులను విశ్వసించకండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
తుల :- ఫ్యాన్సీ, మందులు, రసాయినిక సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకు కలసిరాగలదు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. బంధు మిత్రులతో ప్రయాణాలు సాగిస్తారు. తలపెట్టిన పనులు ఆశించనంత చురుకుగాసాగవు. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు.
వృశ్చికం :- కొరియర్ రంగాల వారికి పనిభారం తప్పదు. మధ్యవర్తిత్వం వహించడం వల్ల మాటపడక తప్పదు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడమంచిది కాదు. ఇతరులపై ఆధారపడక ప్రతి విషయంలోనూ మీరే నిర్ణయం తీసుకోవటం మంచిదని గమనించండి.
ధనస్సు :- సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రైవేటుసంస్థలలోని వారు మార్పుల కోసంచేసే యత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులు సభా సమావేశాలలో పాల్గొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబీకులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలల్లో పాల్గొంటారు.
మకరం :- ఆర్థికంగా బాగుగా స్థిరపడతారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు కార్యకర్తల వల్ల చికాకులు తప్పవు. బంధువుల రాకతో ఖర్చులు అధికం. ఖర్చులు సామాన్యం. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కోటారు. అనుకోని విధంగా మొక్కుబడులు చెల్లిస్తారు.
కుంభం :- కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చేకాలం. రావలసిన ధనం అందటంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రైవేటు సంస్థలలో వారికి సామాన్యంగా ఉంటుంది. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి.
మీనం :- రుణాలు తీరుస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. వృత్తి, వ్యాపారాలకు శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం.