15-01-2025 బుధవారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

రామన్

బుధవారం, 15 జనవరి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. పరిచయాలు బలపడతాయి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికాకుండా చూసుకోండి. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. దంపతులు ఏకాభిప్రాయానికి రాగలుగుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. కొత్త పనులు మొదలెడతారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగవు.
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యానుకూలతకు మరింత శ్రమించాలి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. అపరిచితులతో జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కృషి ఫలించకున్నా శ్రమించామన్న తృప్తి ఉంటుంది. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు, పరిస్థితులు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. వాయిదా వేసిన పనులు పూర్తి చేస్తారు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ఉల్లాసంగా గడుపుతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరిచయాలు బలపడతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. నగదు స్వీకరణ, చెల్లింపుల్లో జాగ్రత్త. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. ప్రముఖులతో  పరిచయాలు ఏర్పడతాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. రుణవిముక్తులవుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పనులు ముందుకు సాగవు. అందరితోను మితంగా సంభాషించండి. విందుల్లో పాల్గొంటారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. విలువైన వస్తువులు జాగ్రత్త.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆత్యీయులతో కాలక్షేపం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అనుకున్నది సాధించే వరకు శ్రమించండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ పట్టుదలే విజయానికి దోహదపడుతుంది. ధనలాభం ఉంది. ఖర్చులు భారమనిపించవు. పనులు పురమాయించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
ధనిష్ట : 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఒత్తిడికి గురికావద్దు. అన్ని విధాలా మంచి జరుగుతుంది. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. దుబారా ఖర్చులు తగ్గించుకోండి. దంపతుల మధ్య అకారణ కలహం. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధవహిస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు