17-03-2025 సోమవారం దినఫలితాలు -

రామన్

సోమవారం, 17 మార్చి 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం 
విజ్ఞతతో సమస్యను పరిష్కరించుకుంటారు. కష్టం ఫలిస్తుంది. నూతన యత్నాలు మొదలు పెడతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రుణ విముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కీలక అంశాలపై పట్టుసాధిస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు స్థిమితంగా పూర్తిచేస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఒత్తిడి తగ్గి స్థిమితపడతారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారిని సంప్రదిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
్కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను వదులుకోవద్దు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. ఇంటి విషయాలు పట్టించుకోండి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం 
సంప్రదింపులు ఫలిస్తాయి. వ్యవహారానుకూలత ఉంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఖర్చులు విపరీతం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ప్రయాణం తలపెడతారు.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
దృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ కృషి ఫలిస్తుంది. విజ్ఞతతో అందరినీ ఆకట్టుకుంటారు. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
లక్ష్యాన్ని సాధిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. పరిచయస్తులతో ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు, కార్యక్రమాలు సాగవు. కీలక చర్చల్లో పాల్గొంటారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆచితూచి అడుగేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు. సోదరులతో సంభాషిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తగవు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగిపోవద్దు. యత్నాలు కొనసాగించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. చేసిన పనులే చేయవవలసి వస్తుంది. ప్రియతములతో కాలక్షేపం చేస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఓర్పుతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. పత్రాలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
ఆశించిన ఫలితాలున్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. రుణ సమస్యలు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఖర్చులు సామాన్యం. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు సాగువు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు