శ్రీ శోభకృత్ నామ సం|| పుష్య శు|| అష్టమి రా.1.12 రేవతి ఉ.8.28 తె.వ.3.25 ల 4.56. ఉ.దు. 10.15 ల 10.59 ప.దు. 2.39 ల 3.23.
దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం సిద్ధిస్తుంది.
మేషం :- ఉద్యోగస్తులు అధికారుల వల్ల సమస్యలు తలెత్తినా మిత్రుల సహకారం వల్ల సమసిపోతాయి. మీ వ్యక్తిగత విషయాలు బయటికి తెలియజేయకండి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ మంచి కోరుకొనేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువగా ఉన్నారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
వృషభం :- ఆదాయ వ్యయాలలో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. బంధువులకు పెద్దమొత్తంలో ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన చాలా అవసరం. గతం కంటే ఆరోగ్యం మెరుగుగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి ప్రయత్నించండి.
మిథునం :- కొత్తగా రుణాల కోసం అన్వేషిస్తారు. ఎదుటి వారిని తక్కువ అంచనా వేయటం మంచిదికాదు. బంధువుల రాక ఇంబ్బదులకు గురిచేస్తుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. చేపట్టిన పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. దైవ భక్తిలో ప్రతి కార్యక్రమాలు పూర్తిచేసుకోవాలి.
కర్కాటకం :- కొన్నివిషయాల్లో అంచనాలు తారుమారవుతాయి. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి. మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలను శ్రద్ధగా మలచుకోవడం వల్లనే వాటికి పరిష్కారం లభిస్తుంది. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
సింహం :- ఆదాయం రావడం, ఖర్చుచేయడం అన్నీ కూడా మీ ఇష్టానుసారంగా జరిగి మీరు ఆనందించేలా ఉంటాయి. స్థిరాస్తి లేక ఇంటికి సంబంధించిన వ్యవహారాలు సఫలికృతం అవుతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్థులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటివి అందుకుంటారు.
కన్య :- కొబ్బరి, పండ్లు, కూరగాయలు, పూల వ్యాపారస్తులకు లాభదాయకం. భారవంతమైన పనులు కూడా మనసుకు బాధలేకుండి పూర్తి చేస్తారు. స్థిరాస్తి లేక ఇంటికి సంబంధించిన వ్యవహారాలు సఫలీకృతం అవుతాయి. సోదరి, సోదరులతో కులాసాగా గడుపుతారు. పుణ్యక్షేత్ర దర్శనములు తేలికగా పూర్తి చేయగలుగుతారు.
తుల :- బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్త పడడం అవసరం. స్త్రీలకు షాపింగులోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చేపట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. చిన్ననాటి స్నేహితుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చరాన్ని కలిగిస్తాయి.
వృశ్చికం :- ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. పాత బాకీలు అనుకోకుండా వసూలవుతాయి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి స్నేహితులు మీకు కొత్తగా పరిచయమవుతారు. కుటుంబంలో అదనపు బరువు బాధ్యతలు అధికమవుతాయి. పారితోషికాలు అందుకుంటారు. మీ ఆలోచనలు స్థిమితంగా ఉండవు.
ధనస్సు :- కొత్త ప్రయత్నాలు ఏమి చేయవద్దు. దైవ దర్శనాలలో చికాకులు తప్పవు. ప్రభుత్వ కార్యక్రమాలలోని పనులు సానుకూలమవుతాయి. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. షాపు పనివారలు, కొనుగోలుదార్లతో లౌక్యంగా మెలగండి. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
మకరం :- ఉమ్మడి వ్యవహారాలు, ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. స్త్రీలు కళాత్మక పోటీల్లో రాణిస్తారు. ఉపాధ్యాయుల శ్రమకు గుర్తింపు లభిస్తుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని అందిపుచ్చుకోవటం ఉత్తమం. ప్రయాణాలు అనుకున్నంత సజావుగా సాగవు.
కుంభం :- మీ శ్రీమతి సలహా పాటించటం శ్రేయస్కరం. షేర్ల క్రయ విక్రయాలు ఆశించినంత లాభసాటి కావు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాల్లో లౌక్యంగా ఉండాలి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఒత్తిడి అధికమవుతాయి. ఆత్మీయులు, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు.
మీనం :- అధికశ్రమ, నిద్రలేమి వల్ల అస్వస్థతకు గురవుతారు. బ్యాంకు పనులు అనుకూలిస్తాయి. నూతన గృహం కొనుగోలు ప్రయత్నంలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. స్త్రీలకు వాహనయోగం, కానుకలు, పారితోషికాలు అందుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలను సమీక్షించుకుంటారు. ఖర్చులు పెరిగినాభారమనిపించవు.