19-01-2025 ఆదివారం దినఫలితాలు- రుణసమస్యల నుంచి విముక్తి

రామన్

ఆదివారం, 19 జనవరి 2025 (07:25 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
మనోధైర్యంతో మెలగండి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. నగదు స్వీకరణలో జాగ్రత్త. ప్రతి విషయం జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
మిధునం :మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
నిరుత్సాహం వీడి శ్రమించండి. అవకాశాలను వదులుకోవద్దు. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఇంటి విషయాలు పట్టించుకోండి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సమర్ధతపై నమ్మకం పెంచుకోండి. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. మనోధైర్యంతో వ్యవహరించండి. ఆప్తులను కలుసుకుంటారు. ఓర్పుతో వివాహయత్నాలు కొనసాగిస్తారు. దళారులు, కన్సల్టెంటీలను నమ్మవద్దు. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు సాగవు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. నగదు, కీలక పత్రాలు జాగ్రత్త. ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. అనవసరోక్యం తగదు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. ప్రతిభను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. రావలసిన ధనం అందుతుంది. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఊహించని సంఘటనలెదురవుతాయి. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
యత్నాలు పురోగతిన సాగుతాయి. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు అధికం, పనులు వేగవంతమవుతాయి. న్యాయ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు విపరీతం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొంతమొత్తం అందుతుంది. మానసికంగా స్థిమితపడతారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. సంప్రదింపులు పురోగతిన సాగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు. అప్రమత్తంగా మెలగండి. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోండి.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
లావాదేవీలతో తీరిక ఉండదు. కొన్నిటిలో అనుకూలత, మరికొన్నిటిలో వ్యతిరేకత ఎదురవుతాయి. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఖర్చులు సామాన్యం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
విజ్ఞతతో మెలగండి. ఎవరినీ కించపరచవద్దు. మీ వ్యాఖ్యలు అపార్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. ఖర్చులు సామాన్యం.. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆప్తులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. ప్రయాణం కలిసివస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు