మనోధైర్యంతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి ధనం అందుతుంది. నగదు స్వీకరణలో జాగ్రత్త. దూరపు ఆత్మీయులతో సంభాషిస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. రుణసమస్యల నుంచి విముక్తులవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులు చేపడతారు. లక్ష్యసాధనకు ఓర్పుతో శ్రమిండి. యత్నాలు విరమించుకోవద్దు. అనవసర విషయాల్లో జోక్యం తగదు.
వ్యవహారాలతో తీరిక ఉండదు. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనుభవజ్ఞులతో సంప్రదింపులు జరుపుతారు. ఖర్చులు విపరీతం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆచితూచి అడుగేయండి. నోటీసులు అందుకుంటారు. ఖర్చులు అధికం. అతిగా శ్రమించవద్దు. వివాదాలు సద్దుమణుగుతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు.
మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. పనులు ముందుకు సాగవు. ప్రయాణంలో కొత్తవ్యక్తులతో జాగ్రత్త.
వస్త్రప్రాప్తి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆటంకాలెదురైనా ముందుకు సాగుతారు. లక్ష్యం సాధించే వరకు శ్రమించండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మీ ఇబ్బందులను ఆత్మీయులకు జేయండి. పెద్దల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది.
ఆర్థిక లావీదేవీలతో తీరిక ఉండదు. పనిభారం, ఆకాలభోజనం. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. సన్నిహితులను కలుసుకుంటారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణంలో జాగ్రత్త.
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. కొంతమొత్తం ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు ఓర్పుతో శ్రమించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. ఖర్చులు విపరీతం. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ప్రయాణం చికాకుపరుస్తుంది.