మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్ధికలావాదేవీలతో సతమతమవుతారు. ప్రలోభాలకు లొంగవద్దు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు సాగవు. దంపతుల మధ్య అకారణ కలహం.
ధైర్యంగా యత్నాలు సాగించండి. అనుమానాలకు తావివ్వవద్దు. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. దంపతుల మధ్య అకారణ కలహం. సామరస్యంగా మెలగండి. ఆప్తులకు మీ సమస్యలు తెలియజేయండి. ప్రయాణం తలపెడతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాల భోజనం, విశ్రాంతి లోపం. అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు విపరీతం. ఆరోగ్యం బాగుంటుంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సన్నిహితులతో సంభాషిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం దూకుడు అదుపుచేయండి. కొత్త పరిచయాలేర్పడతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వాహనదారులకు దూకుడు తగదు.
పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. కుటుంబసౌఖ్యం పొందుతారు, ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు చేపడతారు.
ఆర్థిక లావాదేవీలు కొలిక్కివస్తాయి. సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అపరిచితులతో మితంగా సంభాషించండి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఓర్పుతో మెలగండి. పరిచయస్తుల వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆత్మీయులు సాయం అందిస్తారు. ఒక సమస్య పరిష్కారమవుతుంది. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
బాకీలు వసూలవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్తయత్నాలకు శ్రీకారం చుడతారు. వాహనం ఇతరులకివ్వవద్దు.
బంధుమిత్రులతో విభేదిస్తారు. సామరస్యంగా మెలగండి. ఖర్చులు విపరీతం. అవసరాలకు ధనం అందుతుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. అయిన వారితో సంభాషిస్తారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.
ఓర్పుతో మెలగండి. ఖర్చులు విపరీతం. ఆప్తులు సాయం అందిస్తారు. పనులో ఒత్తిడి అధికం. అప్రియమైన వార్త వింటారు. కార్యక్రమాలు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆరోగ్యం జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. బెట్టింగులకు పాల్పడవద్దు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలకు ధనం అందుతుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహలిస్తారు. పనులు సానుకూలమవుతాయి. దైవకార్యంలో పాల్గొంటారు.